Breaking News

తెలుగు రాష్ట్రాల గుండా ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల గుండా ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ: లాక్‍డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లు, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మరో 80 రైళ్లను నడపనుంది. రైల్వేశాఖ ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే సర్వీసులను వినియోగించవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే..
–రైలు నం.07007 సికింద్రాబాద్ నుంచి దర్బంగా వెళ్తుంది. ప్రతీ మంగళవారం, శనివారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇక రైలు నం. 07008 దర్భంగా నుంచి సికింద్రాబాద్ వస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గురువారం, శుక్రవారం నడుస్తుంది.
– రైలు నం.08517 కోర్బా నుంచి విశాఖపట్నం వస్తుంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతిరోజూ సాయంత్రం 4.10 గంటలకు ప్రారంభమవుతుంది. రైలునం.08518 విశాఖపట్నం నుంచి కోర్బాకు ప్రతిరోజూ రాత్రి 8.05 గంటలకు అందుబాటులో ఉంటుంది. విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.
– రైలునం.07563 హైదరాబాద్ నుంచి పర్భనీకి ప్రతిరోజూ వెళ్తుంది. రైలునం.07564 పర్భనీ నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజు నడుస్తుంది.
– రైలు నం.02615 చెన్నై నుంచి న్యూఢిల్లీ, రైలు నం.02616 న్యూఢిల్లీ నుంచి చెన్నైకి ప్రతిరోజూ వెళ్తాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
– రైలు నం.02669 చెన్నై నుంచి చాప్రాకు సోమవారం, శనివారం, రైలు నం.02670 ఛాప్రా నుంచి చెన్నైకి సోమవారం, బుధవారం నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
– రైలునం.02663 హౌరా నుంచి తిరుచ్చిరాపల్లికి గురువారం, శనివారం, రైలునం.02664 తిరుచ్చిరాపల్లి నుంచి హౌరాకు మంగళవారం, శుక్రవారం నడుస్తాయి. ఈ రైళ్లు విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
– రైలు నం.02509 బెంగళూరు నుంచి గౌహతికి బుధవారం, గురువారం, శుక్రవారం, రైలు నం.02510 గౌహతి నుంచి బెంగళూరుకు సోమవారం, మంగళవారం, ఆదివారం నడుస్తాయి. ఈ రైళ్లు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖటప్నం విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
– రైలునం.08401 ఖుర్దా రోడ్ నుంచి ఓఖాకు ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1.55 గంటలకు, రైలు నం.08402 ప్రతి బుధవారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతుంది. శ్రీకాకుళం రోడ్, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, వరంగల్, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.