సారథిన్యూస్, వికారాబాద్: శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా కొండంగల్- తాండూరు రహదారిపై వంతెన తెగిపోయింది. కాగ్నా నదిపై ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షంతో తాండూరు నియోజకవర్గంలోని పంటపొలాలు నీట మునిగాయి. పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండాయి.
- July 3, 2020
- Archive
- మెదక్
- షార్ట్ న్యూస్
- KAGNA
- Rain
- VIKARABAD
- చెరువులు
- వంతెన
- Comments Off on తెగిన కాగ్నా వంతెన