కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన తాప్సీ బాలీవుడ్ లోనూ తన సత్తాచాటుకుంది. మొదట గ్లామర్ పాత్రలే ఎక్కువ చేసినా తర్వాత విమెన్ ఓరియెంటెడ్ రోల్స్‌ను ఎంచుకోవడమే కాదు నటనకు ఇంపార్టెన్స్ ఉండే చిత్రాల్లో మాత్రమే చేస్తోంది. ఆ నేపథ్యంలో బాలీవుడ్ లో వరుస విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్ గా ‘థప్పడ్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టింది కూడా. ప్రస్తుతం మిథాలీరాజ్ బయోపిక్ శభాష్ మిథూలో నటిస్తున్న తాప్సీ ‘ఎవరు’ తమిళ రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అడవి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమాను స్పానిష్ ఫిలిం ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ ఆధారంగా రూపొందించారు.
‘ఎవరు’ సినిమా కంటే ముందు అదే కాన్సెప్ట్ తో ‘బద్లా’గా బాలీవుడ్ లో విడుదలైన ఈ చిత్రం అటు ప్రేక్షకుల నుంచి ఇటు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అమితాబ్ బచ్చన్ నటించిన ఈ సినిమాలో తాప్సీ ఓ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నారట. హిందీలో నటించిన పాత్రలోనే తాప్సీ ఇప్పుడు తమిళ రీమేక్ లోనూ నటించనుందని టాక్. ఇదిలాఉంటే కన్నడలోనూ ఈ మూవీని రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత ఈ రీమేక్ వార్తలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.