సారథి న్యూస్, కామారెడ్డి: ఇతరులకు చెందిన భూమిని తన పేరిట పట్టా చేయాలని ఓ మాజీ నక్సలైట్ ఏకంగా తహసీల్దార్‌నే బెదిరించాడు. పట్టా చేయకపోతే చంపేస్తానని హెచ్చరించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలోని రామారెడ్డిలో చోటుచేసుకుంది. రామారెడ్డి మండల తహసీల్దార్ షర్ఫుద్దీన్‌పై గిద్ద గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ నర్సారెడ్డి బెదిరింపులకు దిగాడు. ఇతరులకు చెందిన ఆరెకరాల భూమిని తన పేరిట రికార్డు చేయాలని బెదిరించాడు. దీంతో భయానికి లోనైన తహసీల్దార్ షర్ఫుద్దీన్ రామారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇతరుల భూమిని పట్టా చేసి ఇవ్వకపోతే చంపుతానని బెదిరించినట్లు తహసీల్దార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- June 25, 2020
- Top News
- KAMAREDDY
- NAXALITE
- RAMAREDDY
- కామారెడ్డి
- మాజీ నక్సలైట్
- రామారెడ్డి
- Comments Off on తహసీల్దార్‌కు మాజీ నక్సలైట్ బెదిరింపులు