న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైలులో 20 మందికి సిబ్బందికి కరోనా పాజిటిల్ అని తేలిందని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ప్రకటించింది. వాళ్లందరికీ ఎలాంటి లక్షణాలు లేవని డీఎంఆర్‌సీ డైరెక్టర్ మంగూసింగ్ అన్నారు. ‘మిగతా దేశంతో పాటు డీఎంఆర్‌సీ కూడా కరోనాతో పోరాడుతోంది. మెట్రోను సిద్ధం చేసేందుకు కొంత మంది ఎంప్లాయీస్ డ్యూటీలకు వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు వారిలో కొంత మందికి కరోనా సోకింది. కానీ వాళ్లందరూ ఇప్పుడు కోలుకుంటున్నారు. ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని చర్యలు తీసుకుని మెట్రో సేవలు పునరుద్ధరించేందుకు రెడీగా ఉన్నాం’ అని మంగూసింగ్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశారు. ప్రతి ఒక్క ఎంప్లాయ్ సోషల్ డిస్టెంసింగ్ పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ విధించడంతో ఢిల్లీ మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. కాగా లాక్‌డౌన్ 4.0లో మెట్రో సేవలకు అనుమతివ్వాలని కోరినప్పటికీ కేంద్రం దానికి ఒప్పుకోలేదు.
- June 5, 2020
- జాతీయం
- DELHI METRO
- LOCKDOWN
- కరోనా
- డీఎంఆర్‌సీ
- లాక్‌డౌన్ 4.0
- Comments Off on ఢిల్లీ మెట్రో సిబ్బందికి కరోనా