చాలెంజింగ్ రోల్స్‌ను ఎక్కువగా ఇష్టపడే రెజీనా కాసాండ్రా తెలుగు, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపే తెచ్చుకుంది. అ, ఎవరు సినిమాలతో ఇంకా ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యింది. లాక్ డౌన్ సమయంలో ‘నాట్ సో లేట్’ అన్న పేరుతో ఇన్‌స్టా గ్రామ్‌లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో లైవ్ నిర్వహిస్తోంది రెజీనా. వినూత్నమైన ఈ ప్రయోగానికి ఆమె అభిమానులు ముగ్ధులైపోతున్నారు.
ఈ షోలో ఇండియన్ డ్రాగ్ పెర్ఫార్మర్ మయమ్మాతో లైవ్ షో నిర్వహించింది. అందుకోసం రెజీనా కూడా అచ్చం డ్రాగ్ క్వీన్ మేకప్ వేసుకుని అలాగే తయారైంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలే అందమైన ముద్దుగుమ్మ అలా క్వీన్ ల కనిపించేసరికి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం రెజీనా కార్తిక్ రాజు దర్శకత్వంలో ఫిమేల్ సెంట్రిక్ మూవీ ‘నేనే నా’లో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తోంది. ఇది హార్రర్ థ్రిల్లర్ కావడం విశేషం.