Breaking News

డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి

డీసీఎం, బొలెరో ఢీ.. డ్రైవర్ మృతి
  • విజయవాడ హైవేపై ఘటన

సారథి న్యూస్, యాదాద్రి భువనగిరి: డీసీఎం, బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపురం సమీపంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల కథనం..

విజయవాడ హైవే(ఎన్​హెచ్​ 65) పై మల్కాపురం వద్ద ఆగిన డీసీఎంను హైదరాబాద్ వైపు మామిడికాయల లోడ్​ తో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి ఢీకొట్టింది.

ఈ ఘటనలో బొలెరో వాహనం డ్రైవర్ అజయ్​ కుమార్(20) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.  పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.