Breaking News

‘డబుల్’ ఇండ్లను రెడీ చేయండి

‘డబుల్’ ఇండ్లను రెడీ చేయండి

సారథి న్యూస్, మెదక్: పెండింగ్ పనులను పూర్తిచేసి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఓపెనింగ్ కు మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రం నుంచి జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు, సొసైటీ చైర్మన్, రైస్ మిల్లర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇసుక, స్టీల్, సిమెంట్ కొరత లేకుండా చూసుకుని నిర్మాణాలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు, ఇతర రంగాల కార్మికులను గుర్తించి వారికి వెంటనే జాబ్ కార్డులను అందజేసి ఉపాధి పని కల్పించాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. టెలీకాన్ఫరెన్స్ లో కలెక్టర్ ధర్మారెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, కోనాపూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, డీసీఎస్ వో శ్రీనివాస్ పాల్గొన్నారు.