సారథి న్యూస్, కొత్తగూడెం: జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలను సడలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఎస్పీ సునిల్ దత్తును మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం వ్యాపారానికి, హోల్ సెల్ దుకాణాలకు కేంద్రబిందువుగా ఉందని, వాహనాలకు చలాన్లు వేస్తే షాపులకు ఎవరూ కావడం లేదని వివరించారు. అసలే కరోనా, లాక్ డౌన్ సమయంలో గిరాకీ రాక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీ దృష్టికి తెచ్చారు. వ్యాపారులకు సహకరిస్తామని ఎస్పీ బీజేపీ నాయకులకు భరోసా ఇచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లక్ష్మణ్ అగర్వాల్ ఉన్నారు.
- June 17, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- KOTHAGUDEM
- TRAFFIC
- కొత్తగూడెం
- బీజేపీ
- Comments Off on ట్రాఫిక్ ఆంక్షలు సడలించండి