- ఎండుమిర్చిన తీసుకెళ్తుండగా ఘటన.. మృతులు రైతులు
సారథి న్యూస్, రంగారెడ్డి: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ సంఘటన మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం, శాంతిగూడెం గ్రామానికి చెందిన రామచంద్రయ్య(45), సుబయ్య(36) కలిసి ఎండు మిర్చిని ట్రాక్టర్ లో ఇర్విన్ గ్రామానికి తీసుకొచ్చారు. తిరిగి వెళ్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది.
ఈ ఘటనలో రామచంద్రయ్య, సుబ్బయ్య గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో శాంతిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కల్వకుర్తి ప్రభుత్వాసుప్రతికి తరలించారు.