జంషడ్‌పూర్: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని ఓ విద్యార్థిని నిరూపించింది. జార్ఘండ్ రాష్ట్రం జంషడ్పర్కు చెందిన నందితా హరిపాల్ సీబీఎస్ఈ 12 వతరగతిలో ని ఆర్ట్స్ విభాగంలో 83.8 శాతం మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. నందిత తండ్రి టైలర్‌గా జీవనం సాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి కుటుంబం పేదరికంలో మగ్గుతున్నది. కూతురు నందిత జంషడ్‌పూర్ ఉమెన్స్ కళాశాలలో విద్యనభ్యసించింది. ‘నేను టాపర్‌గా నిలుస్తానని కలలో కూడా ఊహించలేదు. ఫలితాలు చూసి నాతోపాటు కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారు. నేను భవిష్యత్‌లో జర్నలిస్టును కావాలనుకుంటున్నాను. నా విజయానికి కారణం నా తల్లిదండ్రులు, గురువులు ’ అంటూ మీడియాతో తన అభిప్రాయాలు పంచుకున్నది నందిత.