Breaking News

టెస్టులతో సరిపెట్టొదు.. సాయం చేయాలి

టెస్ట్​లతో సరిపెట్టొదు.. సాయం చేయాలి

సారథి న్యూస్, కర్నూలు: కోవిడ్‌–19 నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫమైందని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు సాకే శైజానాథ్‌ విమర్శించారు. ప్రతి ఇంటిలో కోవిడ్‌ టెస్ట్​చేస్తున్నారని, అంతటితో సరిపెట్టకుండా మందు అందజేసి, ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయాలని కోరారు. శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, ప్రజాప్రతినిధులకు ఇసుకే కల్పవృక్షంగా మారిందన్నారు. సారా తయారీ, అక్రమ ఇసుక సరఫరాను అధికార పార్టీ నాయకులే నిర్వహిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వాటిపై ప్రత్యేకదృష్టి సారించాని సూచించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏడాది పాలనలో ప్రజలు విసుగుచెందారని అన్నారు.

అనంతరం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధు యాదవ్‌ మాట్లాడుతూ.. పూటకో పార్టీ మారే బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి.. నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చింత మోహన్‌ రావు, డీసీసీ ప్రధాన కార్యదర్శి కె.పెద్దారెడ్డి, కర్నూలు, మంత్రాలయం, కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్​జాన్‌ విల్సన్‌, బాబురావు, డీసీసీ సెక్రటరీ పోతుశేఖర్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.