Breaking News

టెర్రరిస్టుల కాల్పుల్లో జవాను, బాలుడి మృతి

టెర్రరిస్టుల కాల్పుల్లో జవాను, బాలుడు మృతి


శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లోని సౌత్‌ అనంత్‌నాగ్‌ జిల్లా బిజ్‌బెహరాలో టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక సీఆర్‌‌పీఎఫ్‌ జవాను, ఐదేళ్ల బాలుడు మృతిచెందారు. సెక్యూరిటీ ఫోర్స్‌పై టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు చెప్పారు. సీఆర్‌‌పీఎఫ్‌ 90 బెటాలియన్‌ వద్ద రోడ్‌ ఓపెనింగ్‌ జరుగుతుండగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఆర్‌‌పీఎఫ్‌ జవాను, ఐదేళ్ల బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించగా.. ట్రీట్‌మెంట్‌ తీసుకుంటూ చనిపోయారని పోలీసులు చెప్పారు. టెర్రరిస్టులు కోసం గాలిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఉదయం జమ్మూకాశ్మీర్‌‌లోని పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారు.