Breaking News

టెన్నిస్​ దిగ్గజం ఆష్లే కూపర్​ మృతి

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియా టెన్నిస్​ దిగ్గజం ఆష్లే కూపర్ (86) శనివారం అనారోగ్యంతో మరణించారు. 1958లో ఆస్ట్రేలియన్‌, వింబుల్డన్‌, యూఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ టైటిల్స్​ను సొంతం చేసుకున్న కూపర్​ నంబర్‌ వన్‌ ర్యాంక్‌లోనూ నిలిచాడు. 1957లో ఆస్ట్రేలియా టీమ్‌ డేవిస్‌ కప్‌ను నిలబెట్టుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. వెన్ను నొప్పి కారణంగా 1959లో కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన కూపర్‌.. ఆ తర్వాత బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. టెన్నిస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కొనసాగాడు.

‘ప్లేయర్‌గా, అడ్మినిస్ట్రేటర్‌గా కూపర్‌ అద్భుతమైన పాత్ర పోషించాడు. ఆయన సేవలను ఎప్పటికీ మరువలేం. కూపర్‌ మరణం ఆస్ట్రేలియా టెన్నిస్‌కు తీరని లోటు’ అని టెన్నిస్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్రెయిగ్‌టైలీ వెల్లడించారు. ఆష్లే నిజాయితీ కలిగిన చాంపియన్‌, మంచి ఫ్యామిలీ మ్యాన్‌ అని ఆసీస్‌టెన్నిస్‌ గ్రేట్‌రాడ్‌ లేవర్‌ నివాళి అర్పించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెన్నిస్​ ప్లేయర్లు కూపర్​ మృతికి ఘనంగా నివాళి ఆర్పించారు.