Breaking News

టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

టెన్త్ స్టూడెంట్స్​ కు ఆన్​ లైన్​ శిక్షణ

ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ

సారథి న్యూస్​, అనంతపురం: టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్​కు ఆన్​ లైన్​లో శిక్షణ ఇవ్వాలని ఏపీ బీసీ సంక్షేమశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ అధికారులకు సూచించారు. శనివారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. కరోనా నేపథ్యంలో మార్చి 16 నుంచి విద్యాసంస్థలను మూసేశామని, మే 3తో లాక్‌డౌన్‌ ముగియనుందని చెప్పారు. స్కూలు, కాలేజీలు, హాస్టళ్లను వచ్చే విద్యాసంవత్సరానికి సిద్ధం చేయాలని సూచించారు.

ఐఐటీ, జేఈఈ వంటి పోటీపరీక్షలకు ప్రభుత్వం శిక్షణ తరగతులను కూడా ఆన్ లైన్​ పద్ధతిలో నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ సంచాలకుడు బి.రామారావు, బీసీ కార్పొరేషన్ ఎండీ ఎం.రామారావు, ఎంజేఏపీ స్కూళ్ల సెక్రటరీ కృష్ణమోహన్, అడిషనల్ డైరెక్టర్ మాధవిలత పాల్గొన్నారు.