Breaking News

టెన్త్​ ఎగ్జామ్స్​కు జాగ్రత్తలు తీసుకోండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా వైరస్​ వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో వాయిదాపడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ.. కరోనా వైరస్ కట్టడి చర్యలపై గురువారం మాసాబ్​ట్యాంక్​లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో గురుకులాల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్ ప్రవీణ్​కుమార్​, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా చొంగ్తుతో సమీక్షించారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విద్యాలయాల్లో 2949 మంది విద్యార్థులు ఉన్నారని అన్ని జిల్లాలో వీరికోసం 38 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. హాస్టళ్లు, ఎగ్జామ్​ సెంటర్లలో శానిటైజర్ వాడేలా, మాస్క్ లు కట్టుకునేలా చూడాలని సూచించారు.