సారథి న్యూస్, శ్రీకాకుళం: సివిల్ సప్లయీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పీపీసీ కేంద్రాల్లో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్స్ ను ప్రభుత్వం కంటిన్యూ చేసి ఆదుకోవాలని టెక్నికల్ అసిస్టెంట్స్ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మంత్రి కృష్ణదాసును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తాము ప్రైవేట్ జాబ్స్ వదులుకొని ఇందులో కొనసాగుతున్నామని, ప్రభుత్వ సంస్థ కావడంతో తమకు భవిష్యత్ ఉంటుందని భావించామన్నారు. మూడునెలల తర్వాత హోల్డ్‌లో పెట్టడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఏల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హారేరాం, లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు శ్యాం, ఈశ్వర్రావు, సురేష్, కృష్ణ పాల్గొన్నారు.
- May 26, 2020
- ఆంధ్రప్రదేశ్
- శ్రీకాకుళం
- TECHNICALASSISTANCE
- టెక్నికల్ అసిస్టెంట్స్
- మంత్రి ధర్మాన
- శ్రీకాకుళం
- సీఎం జగన్
- Comments Off on టెక్నికల్ అసిస్టెంట్స్ ను ఆదుకోవాలి