సారథి న్యూస్, పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా జేఏసీ పిలుపు మేరకు మే నెల నుంచి పూర్తివేతనం, గత రెండు నెలల సగం వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీచర్లు శనివారం ఇంటి వద్దనే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటి వద్దనే నల్ల బ్యాడ్జీలు ధరించి, ఫ్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి గోల్కొండ శ్రీధర్, జిల్లా కోశాధికారి టి.రాణి సుజాత, జిల్లా కార్యదర్శులు జి. శ్రీనివాస్, జి. రాజయ్య, యన్. క్రాంతి, కోట లక్ష్మణ్, గోల్కొండ. బబిత, బి. సంతోష్ , ఎన్. వాణి పాల్గొన్నారు.