బీజింగ్: మన దేశంలో అత్యంత ఆదరణ పొందిన చైనా యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేయడంతో సదరు కంపెనీకి దాదాపు 6 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. బైట్‌డ్యాన్స్ లిమిటెడ్‌కి చెందిన టిక్‌టాక్ బ్యాన్‌తో పాటు మరో రెండు యాప్‌లను కూడా మన ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ యాప్స్ బ్యాన్ వల్ల దాదాపు ఆరు బిలియన్ డాలర్లు చైనాకు నష్టం వాటిల్లుతుందని కంపెనీకి చెందిన ఒక వ్యక్తి కూడా చెప్పారు. చైనా ప్రభుత్వంతో డేటా షేర్ చేస్తున్నారనే ఆరోపణలను రావడంతో విదేశాల నుంచి బైట్‌డ్యాన్స్ కంపెనీకి ఒత్తిడి వస్తోందని అతను చెప్పారు.
చైనా యాప్స్ బ్యాన్ చేయడం మిగతా యాప్స్ కంటే టిక్‌టాక్ యాప్‌కు చాలా పెద్ద దెబ్బ అని ఎక్స్‌పర్ట్స్ అన్నారు. వాటితో పాటు ఆ సంస్థకు చెందిన హలో, విగో వీడియో, కూడా మంచి ఆదరణ ఉందని, దాన్ని కూడా బ్యాన్ చేయడం వల్ల పెద్ద నష్టం వస్తుందన్నారు. వాటితో పాటు చైనా కంపెనీలైన అలీబాబా లాంటి గ్రూప్స్‌కు చెందిన కొన్ని ప్రొడక్ట్స్ కూడా బ్యాన్ అయ్యాయి. ప్రపంచదేశాలతో పోలిస్తే టిక్‌టాక్‌ను ఇండియాలోనే అత్యధికంగా ఉపయోగిస్తారు.