Breaking News

టార్గెట్​ అశోక్​ గెహ్లాట్

జైపూర్​: రాజస్థాన్​లో బీజేపీ తనదైన శైలిలో రాజకీయాలు ప్రారంభించింది. సీఎం అశోక్​ గెహ్లాట్​ను పదవినుంచి దించడమే లక్ష్యంగా ఆపార్టీ పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం వెనుక ఉండి మంత్రాంగం నడుపుతున్నది. తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కాంగ్రెస్​పార్టీ కకావికలమవుతుంది. అయితే తాజాగా సీఎం అశోక్​ గెహ్లాట్​ అనుచరులైన ఇద్దరిపై ఐటీదాడులు జరుగడం బీజేపీ వ్యూహంలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. సోమవారం కాంగ్రెస్​ నేతలు, సీఎం అశోక్​ గెహ్లాట్​కు సన్నిహితులైన ధర్మేంద్ర రాథోడ్​, రాజీవ్ అరోరా నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి. రాష్ట్రంలో గంట గంటకు ఉత్కంఠ భరితంగా రాజకీయాలు మారుతున్నాయి. రాజస్థాన్​ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని మీడియాకు చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్​ పార్టీ తమకు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నదని చెబుతుంది. ఏ నేపథ్యంలో మధ్యప్రదేశ్​లో క్యాంప్​ రాజకీయాలకు తెరలేచే అవకాశం ఉన్నది. దీంతో సీఎం ఆర్థికమూలాలను దెబ్బతీసేందుకే బీజేపీ ఐటీ దాడులను చేయిస్తున్నదని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. కాగా రాజస్థాన్​లోని కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ యత్నిస్తున్నదని కొంతకాలంగా సీఎం అశోక్​ గెహ్లాట్​ ప్రకటనలు చేస్తున్నారు. అందుకనుగుణంగానే డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ తిరుగుబావుట ఎగురవేశారు. కాగా సచిన్​ పైలట్​కు బీజేపీతో బేరం కుదరలేదన్న వార్తలు వస్తున్నాయి. అతడికి సీఎం పదవి ఇచ్చేందుకు భారతీయ జనతాపార్టీ సముఖంగా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో సచిన్​ పైలట్​ తన వర్గం ఎమ్మెల్యేలతో బయటకు వెళ్లి సొంతంగా ప్రాంతీయపార్టీని ఏర్పాటు చేస్తాడని కొన్ని మీడియాసంస్థలు కథనాలు ప్రసారం చేశాయి. ఏది ఏమైనా రాజస్థాన్​ ప్రస్తుతం గందోరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.