సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): సరుకుల కోసం పుట్టిలో కృష్ణానదిని దాటుతూ గల్లంతైన నలుగురు మహిళల్లో ఇద్దరి డెడ్బాడీస్మంగళవారం దొరికాయి. కర్ణాటకలోని రాయిచూర్జిల్లా యాపలదిన్నె మండలం కుర్వపురం గ్రామం నుంచి నిత్యం సరుకుల కోసం తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పంచదేవ్ పహాడ్ గ్రామానికి పుట్టిల్లో వస్తుంటారు. ఎప్పటిలాగే వారు ఆదివారం వచ్చారు. ఈ సమయంలో కృష్ణానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో పుట్టిలో ఉన్న 14మందిలో నలుగురు మహిళలు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి డెడ్బాడీస్జూరాల ప్రాజెక్టులో తేలినట్లు అమరచింత ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతులు కర్ణాటకలోని పెద్దకురం గ్రామానికి చెందినవారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.
- August 19, 2020
- Archive
- మహబూబ్‌నగర్
- షార్ట్ న్యూస్
- JURALA
- Comments Off on జూరాలలో తేలిన మహిళల డెడ్‌బాడీస్