సారథి న్యూస్, నాగర్ కర్నూల్: టీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని.. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన మంత్రి పదవికి రాజీనామా చేసి పాదయాత్ర చేపట్టి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా కొల్లాపూర్లో మంగళవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జూపల్లి యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాన్ని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
అనంతరం ఆయన రక్తదానం చేశారు. యువత సామాజిక సేవా స్ఫూర్తితో స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు రక్తదానం చేశారు.