Breaking News

జాతి వివక్షపై గళం విప్పండి

కింగ్​​స్టన్​: ప్రపంచంలో కొనసాగుతున్న జాతి వివక్షపై అందరూ గళం విప్పాలని విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ స్యామీ అన్నాడు. జాత్యహంకర ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నాడు. క్రికెట్​ లోకం దీనిపై మాట్లాడాలని కోరాడు. ‘ఐసీసీతో పాటు అన్ని సభ్యదేశాలు దీనిపై మాట్లాడాలి. ఈ దురాగతాన్ని ఖండించాలి. లేదంటే ఈ వివక్షలో వీళ్లు కూడా భాగస్వాములేనని అనుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సామాజిక పిశాచి. దీనిని తరిమి కొట్టేదాకా ఎవరూ విశ్రమించకూడదు’ అని స్యామీ ఘాటుగా వ్యాఖ్యానించాడు. జాత్యహంకారానికి చోటు లేని సంస్కృతిని తీసుకురావాల్సిన అవసరం చాలా ఉందని లంక మాజీ కెప్టెన్ సంగక్కర అన్నాడు. మరోవైపు వర్ణ వివక్షను వ్యతిరేకిస్తూ.. లివర్ ఫుట్​ బాల్​ క్లబ్ ప్లేయర్లు వినూత్నంగా ప్రదర్శనలు చేశారు.