జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. కట్రాకు 88 కి.మీ.దూరంలో తెల్లవారుజామున 4.55 గంటలకు సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైందని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ భూప్రకంపనలతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధకారులు చెప్పారు. గురువారం కూడా జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది. జూన్ 27వతేదీన సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదైంది. జమ్మూకాశ్మీర్, అసోం రాష్ట్రాల్లో వరుస భూకంపాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుస భూకంపాలతో జమ్మూకాశ్మీర్ ప్రజలు పలు సార్లు ఇళ్లలో నుంచి బయటకు పరుగులుతీశారు.
- July 18, 2020
- Archive
- EARTHQUAKE
- JAMMUKASHMIR
- అసోం
- జమ్మూకాశ్మీర్
- భూకంపం
- Comments Off on జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ భూకంపం