Breaking News

జగన్నాథ రథయాత్ర వద్దు

న్యూఢిల్లీ/భువనేశ్వర్‌: చారిత్రక జగన్నాథ రథయాత్రను ఈ సారి నిర్వహించవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. జూన్​ 23 నుంచి ఒడిశాలోని పూరిలో రథయాత్ర ప్రారంభం కావలసి ఉన్నది. కాగా కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్రను నిలిపివేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్​ దాఖలు చేసింది. రథయాత్రకు అనుమతిస్తే భారీగా ప్రజలు గుమిగూడతారని స్వచ్ఛంద సంస్థ తరఫున సీనియర్​ న్యాయవాది ముకుల్​ రోహతి వాదించారు. ఇతడి వాదనతో ఏకీభవించిన ధర్మాసనం రథయాత్రను నిలిపివేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూరీ సహా రాష్ట్రంలో ఎక్కడా రథయాత్రలు నిర్వహించవద్దని ఆదేశించింది. ‘ఈ ఏడాది రథయాత్రను అనుమతిస్తే జగన్నాథుడు కూడా మనల్ని క్షమించడు’ అంటూ చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరి, జస్టిస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.