న్యూఢిల్లీ: చైనా సామగ్రిని తాము వాడటం లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) స్పష్టం చేసింది. ఇక నుంచి తాము చైనా నుంచి ఎలాంటి పరికరాలను దిగుమతి చేసుకోబోమని స్పష్టం చేశారు. బార్బెల్స్, వెయిట్ ప్లేట్స్తో కూడిన నాలుగు వెయిట్ లిఫ్టింగ్ సెట్స్ కోసం గతేడాది భారత సమాఖ్య.. చైనాకు చెందిన జేకేసీ కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. అయితే ఆ కంపెనీ పరికరాల్లో లోపాలు ఉన్నట్లు తేలడంతో వెయిట్ లిఫ్టర్లు వాటిని ఉపయోగించడం లేదు. ‘చైనా సామగ్రిని మేం నిషేధించాం. ఈ మేరకు సాయ్‌కి లేఖ కూడా రాశాం’ అని ఐడబ్ల్యూఎల్ఎఫ్ సెక్రటరీ జనరల్ సహదేవ్ యాదవ్ వెల్లడించాడు. భారత్‌కు చెందిన కంపెనీలు తయారు చేసిన లిఫ్టింగ్ సెట్లను మాత్రమే ఉపయోగిస్తామన్నాడు. చైనా పంపించిన ప్లేట్స్ నాసిరకంగా ఉన్నాయని నేషనల్ కోచ్ విజయ్ శర్మ తెలిపాడు.
- June 23, 2020
- Archive
- క్రీడలు
- CHINA
- GALWAN
- WAR
- వెయిట్ లిఫ్టింగ్
- సామగ్రి
- Comments Off on చైనా సామగ్రిని వాడటం లేదు