సారథి న్యూస్, రామాయంపేట: చెరువుల్లోని చేపలపై తొలి హక్కులు బెస్త, గంగపుత్రులకే చెందేలా రాష్ట్ర గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయాలని చల్మేడ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శులు మంగలిపల్లి శ్రీనివాస్, మంగిలిపల్లి రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడారు. మత్స్యకారుల మెడ మీద కత్తిలా మారిన జీవోలను రద్దుచేయాలన్నారు. ఉచిత చేపపిల్లలకు బదులుగా అంతే మొత్తంలో డబ్బును సొసైటీ ఖాతాలో జమచేస్తే మంచి నాణ్యమైన చేపలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులుతామని వారు పేర్కొన్నారు.
- July 18, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BESTA
- FISHERMEN
- గంగపుత్రులు
- బెస్తలు
- మత్స్యపరిశ్రమ
- Comments Off on చెరువులపై హక్కులు బెస్తలకే కల్పించాలి