Breaking News

చివరిగింజ దాకా కొంటాం

చివరిగింజ దాకా కొంటాం
  • ‘ఏ’ గ్రేడ్ వరి క్వింటాలు మద్దతు ధర రూ.1835
  • ‘బీ’ గ్రేడ్ ధాన్యానికి రూ.1815

సారథి న్యూస్​, నాగర్​ కర్నూల్​: తెల్కపల్లి, పెద్దకొత్తపల్లి మండల కేంద్రాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం నాగర్ కర్నూల్​ కలెక్టర్‌ ఈ.శ్రీధర్ తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. రైతులు తమ ధాన్యాన్ని తేమ లేకుండా చూసుకోవాలన్నారు. ‘ఏ’ గ్రేడ్ వరి క్వింటాలు మద్దతు ధర రూ.1835, ‘బీ’ గ్రేడ్ ధాన్యానికి రూ,1815 చెల్లించనున్నట్లు తెలిపారు. వరి, మొక్కజొన్న పంటను చివరి గింజ దాకా కొంటామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. తెలకపల్లి కేంద్రంలో ఇప్పటివరకు 1250 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలుచేసినట్లు తెలిపారు. పెద్దకొత్తపల్లి కొనుగోలు కేంద్రంలో 890 క్వింటాళ్ల వరి ధాన్యం కొన్నామని చెప్పారు. అధికారులు జారీచేసిన టోకెన్ల ప్రకారం రైతులు వచ్చి ధాన్యం అమ్ముకోవాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 170 వరి కొనుగోలు కేంద్రాల్లో 15,250 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్లు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. ఆయన వెంట జడ్పీ చైర్​పర్సన్​ పెద్దపల్లి పద్మావతి, అదనపు కలెక్టర్లు మనుచౌదరి, హనుమంత్ రెడ్డి, జిల్లా సహకార అధికారి శ్రీరామ్​ ఉన్నారు.