సారథి న్యూస్, వరంగల్(మహబూబాబాద్): ప్రస్తుతం స్కూళ్లు లేకపోవడంతో విద్యార్థులు ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. ఆ సరదానే వారి ప్రాణాలు తీస్తోంది. మహబూబాబాద్ మండలం శనగపురం గ్రామశివారు బోడతండా సమీపంలో తుమ్మలచెరువులోకి ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఇటీవల భారీగా వర్షం కురిసింది. దీంతో తుమ్మలచెరువులోకి భారీగా వరదనీరు చేరింది. సమీపంలో ఉన్న బోడ తండాకు చెందిన నలుగురు చిన్నారులు బోడ జగన్(12), బోడ దినేష్(13), ఇస్లావత్ లోకేష్(13), ఇస్లావత్ రాకేష్ (12) ఈతకు వెళ్లారు. నీటిలోకి దిగాక ఈత రాకపోవడంతో ఊపిరాడక ప్రాణాలు వదిలారు. ఒకే తండాలో నలుగురు మృత్యువాతపడడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
- July 4, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- BODATANDA
- SHANAGAPURAM
- ఈత
- చిన్నారులు
- తుమ్మలచెరువు
- Comments Off on చిన్నారుల ప్రాణాలు తీసిన ఈత