Breaking News

చలివాగులో చిక్కినవారు సేఫ్​

వాగులో చిక్కినవారు సేఫ్​

జయశంకర్‌ భూపాలపల్లి: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చలివాగులో చిక్కుకున్న టేకుమాట్ల మండలం కుందనపల్లికి చెందిన 10 మంది రైతులు సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం వ్యవసాయ బావి మోటార్లను తీసుకొచ్చేందుకు వాగులోకి వెళ్లిన రైతులు అందులోనే చిక్కుకున్నారు. తక్షణం స్పందించిన మంత్రి కె.తారక రామారావు రెండు ఎయిర్ ఫోర్స్ ​హెలిక్యాప్టర్లను పంపించారు. వారిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. వారు క్షేమంగా బయటికిరావడంతో కుటుంబ సభ్యులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. మంత్రి ఎర్రవబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. కాగా, మంత్రి కేటీఆర్‌కు రైతుల కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రిని అభ్యర్థించిన ఎమ్మెల్యే గండ్ర
భూపాలపల్లి జిల్లాలో టేకుమాట్ల మండలం కుందన్ పల్లి గ్రామం వద్ద ఉన్న చలివాగులో చిక్కుకున్న 12 మంది రైతులను వెంటనే రక్షించాలని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంత్రి కేటీఆర్ ను ఫోన్ ద్వారా అభ్యర్థించారు. వెంటనే స్పందించిన మంత్రి, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ తో ఫోన్ లో మాట్లాడి ఎయిర్​ఫోర్స్​హెలికాప్టర్ ను పంపించారు.