సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్ పరేడ్ మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీసుశాఖ,జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అంక్షల అమలులో ప్రతిఒక్కరూ అహర్నిశలు కష్టపడి పనిచేశారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులోఅడిషనల్ డీసీపీ ఇంజరాపు పూజ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా సిటీ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసులో అడిషనల్ డీసీపీ మురళీధర్, పోలీస్ శిక్షణ కేంద్రంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
- June 2, 2020
- ఖమ్మం
- షార్ట్ న్యూస్
- KHAMMAM
- TELANGANA
- ఆవిర్భావం
- ఖమ్మం పోలీస్
- తెలంగాణ
- Comments Off on ఘనంగా అవతరణ దినోత్సవం