సారథి న్యూస్, బెజ్జంకి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలో సీసీ రోడ్లు, మహిళా భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. సీఎం కేసీఆర్కు సంక్షేమ పథకాలు మంచి పేరు తెచ్చిపెట్టాయని అన్నారు. హరితహారం ఒక ఉద్యమంలా సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ సభ్యురాలు కనగండ్ల కవిత, సర్పంచ్ కనగండ్ల రాజేశం, ఎంపీటీసీ రాజు, ఎంపీడీవో ఓబులేష్ పాల్గొన్నారు.
- July 4, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- BEJJANKI
- RASAMAI
- బాలకిషన్
- బెజ్జంకి
- రసమయి
- Comments Off on గ్రామాల అభివృద్ధే ధ్యేయం