సారథి న్యూస్, హైదరాబాద్: గౌరవెల్లి రిజర్వాయర్ పనుల్లో వేగం పెంచి.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని మంత్రి హరీశ్‌రావు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. శనివారం అరణ్య భవన్ లో ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడిదెల సతీష్ కుమార్ తో కలిసి సమీక్షించారు.
రిజర్వాయర్ పాత కొత్త పనుల కోసం రూ.583.2 77 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రూ.493.91 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులకు ప్రభుత్వం నిర్దేశించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకారం పరిహారం చెల్లించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.