Breaking News

గోదావరి మహోగ్రరూపం

గోదావరి మహోగ్రరూపం

భద్రాచలం: గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గంట గంటకూ ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే చివరిదైన మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. ప్రస్తుతం నీటి ప్రవాహం భద్రాచలం వద్ద 60 అడుగులకు చేరింది. ఇంకా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండడంతో నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. 2014 తర్వాత ఈ స్థాయిలో వరద రావడంతో ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు.

2014, సెప్టెంబర్‌ 8న భద్రాచలం వద్ద 56.1 అడుగుల మేర ప్రవహించింది. ప్రస్తుతం మూడో ప్రమాద హెచ్చరిక జారీతో భద్రాచలం ఏజెన్సీ అతలాకుతలం అవుతోంది. భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాల్లో ముంపు తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ముంపు మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. చర్ల, దమ్ముగూడెం మండలాల్లో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఖమ్మం నుంచి భద్రాచలానికి రాకపోకలను అధికారులు అదుపు చేస్తున్నారు.

భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు రద్దుచేశారు. ఏజెన్సీ ప్రాంతాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి ఉధృతితో భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌లోకి వరద నీరు చేరింది. మణుగూరు మండలం కొండాయిగూడెం శివాలయంలోని నీళ్లు చేరాయి. అలాగే చిన్నరాయిగూడెం జలదిగ్బంధమైంది,

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
SARATHIMEDIA RECORDED