గుర్గావ్: దేశవ్యాప్తంగా రేపటి నుంచి మాల్స్, గుళ్లు ఓపెన్ అయినప్పటికీ హర్యానాలోని గుర్గావ్, ఫరిదాబాద్ జిల్లాల్లో మాత్రం పర్మిషన్ లేదని రాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ విజ్ ఆదివారం చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే హర్యానాలోని మిగతా ప్రాంతాల్లో ఓపెన్ చేసేందుకు పర్మిషన్ ఇచ్చారు. కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ అయి దీనిపై డెసిషన్ తీసుకున్నామన్నారు. ఆన్‌లాక్ 1 కింద ఈ నెల 8 నుంచి గుళ్లు, షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్లకు అనుమతిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
- June 7, 2020
- Archive
- జాతీయం
- SHOPPING MALLS
- TEMPLES
- గుర్గావ్
- సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
- Comments Off on గుళ్లు, షాపింగ్ మాల్స్ తెరవద్దు