Breaking News

ఖేల్‌రత్నకు అమిత్‌, వికాస్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక రాజీవ్​ గాంధీ ఖేల్​ రత్న అవార్డుల కోసం ఇద్దరు బాక్సర్లను భారత బాక్సింగ్ సమాఖ్య(బీఎఫ్ఐ) ప్రకటించింది. ప్రపంచ చాంపియన్ ​షిప్​ రజత విజేత అమిత్ పంగల్(52 కేజీ), వికాస్ క్రిషన్ (69 కేజీ)ను ఈ అత్యున్నత పురస్కారానికి నామినేట్ చేసింది. గతంలో అమిత్ పేరును మూడుసార్లు అర్జున అవార్డుకు సిఫారసు చేసినా సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు.

2012లో డోపింగ్ కేసులో అమిత్ దోషిగా తేలడంతో అతన్ని పక్కనబెడుతూ వచ్చారు. మరి ఇప్పుడు కమిటీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. అదే ఏడాది వికాస్​కు అర్జున అవార్డు దక్కింది. ప్రపంచ చాంపియన్​ షిప్​ కాంస్య విజేత లవ్లీనా బెర్గెహన్ (69 కేజీ), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (64 కేజీ), మనీష్‌ కౌశిక్‌ (63 కేజీ) అర్జున అవార్డులకు సిఫారసు చేసింది. ద్రోణాచార్య అవార్డు కోసం జాతీయ మహిళల కోచ్ మహ్మద్‌ అలీ ఖమర్‌, అసిస్టెంట్‌ కోచ్‌ చోటీ లాల్‌ యాదవ్‌ పేర్లను పంపించారు.