న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో అనేక విజయాలు సాధించిన తెలుగు ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ.. రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్ అయింది. అంతర్జాతీయ స్థాయిలో 33 పతకాలు నెగ్గిన సురేఖకు ఏపీ ప్రభుత్వం కూడా మద్దతుగా నిలిచింది. బ్యాడ్మింటన్‌లో షట్లర్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ షెట్టి, సమీర్ వర్మ అర్జున బరిలో నిలిచారు. ద్రోణాచార్య కోసం ఎస్.మురళీధరన్, భాస్కర్ బాబు నామినేట్ అయ్యారు. ధ్యాన్‌చంద్ అవార్డు కోసం ప్రదీప్ గాంధీ, ముంజుషా కన్వర్ పేర్లను ఫెడరేషన్ రికమెండ్ చేసింది.
భారత మహిళల హాకీ టీమ్ కెప్టెన్ రాణిరాంపాల్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికాబాత్రా కూడా ఖేల్ రత్న రేసులో ఉన్నారు. హాకీలో వందన కటారియా, మోనికాతోపాటు మెన్స్ టీమ్ డ్రాగ్‌ఫ్లిక్ స్పెషలిస్ట్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేర్లను అర్జున అవార్డుకు సిఫారసు చేశారు. ఆర్.పి. సింగ్, తుషార్ ఖండేకర్.. ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ద్రోణాచార్య కోసం కోచ్ బీజే కరియప్ప, రొమేశ్ పొతానియాను ప్రతిపాదించారు. టీటీ నుంచి మధురికా పాఠక్, మానవ్ థక్కర్, సుచిత్ర ముఖర్జీ పేర్లను.. అర్జున అవార్డుకు సిఫారసు చేశారు. కోచ్ జయంత్ పుషిలాల్, ఎస్, రామన్ పేర్లను ద్రోణాచార్య అవార్డు పరిశీలనకు పంపించారు.