సారథి న్యూస్, నారాయణఖేడ్: అయోధ్య రామమందిరం భూమి పూజ ప్రోగ్రాంలో రాష్ట్రం నుంచి పిలుపును అందుకున్న ఏకైక వ్యక్తి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్. భూమి పూజ అనంతరం ఆశ్రమానికి చేరుకున్న ఆయనను శనివారం నారాణయఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కలిశారు. ఆశీస్సులు తీసుకుని శాలువాతో ఘనంగా సన్మానించారు. అయోధ్య వెళ్లొచ్చి నారాయణఖేడ్ కీర్తిని పెంచారని కొనియాడారు. తర్వాత స్థానిక హనుమాన్ మందిరంలో ప్రత్యేకపూజలు చేశారు. హైందవ సంస్కృతి మన జీవన విధానమని, శ్రీ రామచంద్రుడి వంశస్తులు విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. ఆయన వెంట పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
- August 9, 2020
- Archive
- మెదక్
- AYODYA
- MLA BHUPALREDDY
- NARAYANAKHED
- అయోధ్య
- ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి
- నారాయణఖేడ్
- Comments Off on ‘ఖేడ్’ కీర్తిని పెంచారు