Breaking News

ఖమ్మంలో యాంటీజెన్​ టెస్టులు

సారథిన్యూస్​, ఖమ్మం: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో రాపిడ్​ యాంటిజెన్​ టెస్టులు చేస్తున్నారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్​ ఖమ్మంలో ర్యాపిడ్​ యాంటిజెన్​ టెస్టుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు 10 వేల ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్న వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​, మున్సిపల్ కమిషనర్​ అనురాగ్​ జయంతి, డీఎంహెచ్​వో మాలతి తదితరులు పాల్గొన్నారు.