- అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ
లుసానే: టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించేందుకు చివరి తేదీ వచ్చే ఏడాది జూన్ 29. ఈ లోగా అన్ని అర్హత టోర్నీలను పూర్తి చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) సూచించింది. వీలైనంత త్వరగా క్వాలిఫయింగ్ తేదీలను ప్రకటించాలని వెల్లడించింది. క్వాలిఫయింగ్ డ్రాఫ్ట్ ను రూపొందించడానికి సాయం చేయాలని సూచించింది. ‘అంతర్జాతీయ సమాఖ్యల క్యాలెండర్ లో టోర్నీల తేదీలు, వేదికలపై స్పష్టత లేదు. అందుకే వీలైనంత త్వరగా టోర్నీలు నిర్వహించాలి. తేదీలు, వేదికలను ప్రకటిస్తే క్వాలిఫికేషన్ సిస్టమ్లో ఎంట్రీచేస్తాం. ఇది అథ్లెట్లకు ఈజీగా మారుతుంది. ఇప్పటివరకు జరగని అర్హత టోర్నీలపై మా మేనేజర్స్ దృష్టిపెడతారు’ అని ఐవోసీ ప్రకటన విడుదల చేసింది.