మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ పై అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో ఈ మూవీ రీమేక్ హక్కులను సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నారు. ఇక బాలయ్య, రానా వంటి హీరోల పేర్లు ఈ రీమేక్ కోసం వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ తమిళ రీమేక్ హక్కులను హీరో సూర్య దక్కించుకున్నారట. తమ్ముడు కార్తీతో కలిసి ఆయన ఈ చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఒక తాగుబోతు వ్యక్తికి ఒక పోలీస్ ఆఫీసర్‌కు మధ్య జరిగిన గొడవ పెద్దపెద్ద పొలిటిషియన్ల వరకు వెళ్తుంది.
మలయాళంలో పృథ్విరాజ్ సుకుమారన్ డ్రంకర్డ్గా, బిజుమీనన్ పోలీస్ క్యారెక్టర్స్ చేశారు. మరి ఈ సినిమాలో ఇద్దరి అన్నదమ్ముల పాత్రలు ఏ విధంగా ఉండనున్నాయో..ఈ క్రేజీ ప్రాజెక్ట్ కనుక పట్టాలెక్కితే సూర్య ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి. గతంలో సూర్య, కార్తీ కలిసి ఓ మూవీ చేసిన దాఖలాలు లేవు. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీతోనే ఇది సాకారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సూర్య లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ‘సురారై పోట్రు’ మూవీ చేస్తుండగా కార్తీ మణిరత్నం ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘పొన్నియెన్ సెల్వన్’ అనే మూవీతో పాటు ‘సుల్తాన్’ అనే మరో మూవీ కూడా నటిస్తున్నాడు.