Breaking News

క్రిష్ మళ్లీ వస్తున్నాడు..

ఇండియన్స్ ముఖ్యంగా సూపర్ హీరోగా యాక్సెప్ట్ చేసింది ముఖ్యంగా హృతిక్​ రోషన్​ నే.. పిల్లలైతే ఆయన సినిమా ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తుంటారు. అందుకే హృతిక్ ఇప్పుడు ‘క్రిష్’ ఫ్రాంచైజీ తెరకెక్కించడానికి సన్నాహాలు మొదలు పెడుతున్నాడు. ఇంతకుముందు వచ్చిన ఈ సిరీస్​ లో వచ్చిన మూడు సినిమాలూ బిగ్ హిట్టయ్యాయి. ఇప్పుడ ‘క్రిష్ 4’ ను మొదలు పెడుతున్నట్టు హృతిక్ తండ్రి నిర్మాత, దర్శకుడు అయిన రాకేష్ రోషన్ నెలరోజుల ముందు అనౌన్స్ చేశాడు. ఇప్పుడది ఇంకాస్త స్పీడందుకుంది. లాక్​ డౌన్​ సమయాన్ని వృథా చేయకుండా స్క్రిప్టు రెడీ అయిందంటున్నారు. అయితే ఈ సినిమాలో 16 క్రితం వచ్చిన ‘కోయి మిల్​ గయా’లో కీలకపాత్ర చేసిన జాదు పాత్రను మళ్లీ ప్రవేశపెడుతున్నారట. కోయిమిల్​ గయా కథ మొత్తం ఆ జాదూ చుట్టూనే తిరుగుతుంది. బ్రెయిన్ మెచ్యూర్ లేని రోహిత్ మిశ్రాకు స్పేస్ నుంచి వచ్చిన జాదు విల్ పవర్స్ ఇస్తాడు. దీంతో రోహిత్ సూపర్ హీరోగా మారిపోతాడు. ‘క్రిష్ 3’ లో రోహిత్ మిశ్రా క్యారెక్టర్​ ను ఎండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ రోహిత్ మిశ్రా కోసం ‘క్రిష్ 4’లో జాదూను భూమి మీదకు రప్పించే ఏర్పాటు చేస్తున్నారట. ఈసారి వచ్చే జాదు ఇంకెంత పవర్​ ఫుల్​ గా వస్తాడో.. హృతిక్ చేసే ప్రయోగాలన్నీ దాదాపు సక్సెస్ అయ్యియి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అనుకుంటున్నా ఇంకా ఎవరూ డిసైడ్ కాలేదు. ఎవరినీ ఎంచుకోలేదు. ప్రస్తుతం హృతిక్ రోష​న్​ ‘సంషేరా’, ‘చహరే’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.