ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ అన్నాడు. క్రికెట్ పై అప్పట్లో ఎలా ఉండేవాడో ఇప్పుడు అదే దృక్పథం, అంకితభావంతో ఆడుతున్నాడని కితాబిచ్చాడు. అతనితో కలిసి పోటీపడడం తన అదృష్టమని చెప్పాడు. ‘చిన్నప్పటి నుంచి కోహ్లీ ఎదుగుదలను చూస్తున్నా. క్రికెట్ అంటే ప్రాణం పెడతాడు. నేను, అతను ఒకే తరంలో క్రికెట్ ఆడడం నా అదృష్టంగా భావిస్తున్నా. చిన్న వయసులోనే మేమిద్దరం కలుసుకున్నాం. అప్పట్నించి ఓ క్రికెటర్గా అతని పురోగతిని చూస్తున్నా. కొన్నేళ్లుగా మేం ప్రత్యర్థులుగా తలపడుతున్నా.. ఆటపై మా అభిప్రాయాలు, ఆలోచనలను నిజాయితీగా పంచుకుంటాం’ అని విలియమ్సన్ పేర్కొన్నాడు. తమ ఆటతీరు వేరు అయినప్పటికీ.. కొన్ని అంశాల్లో ఇద్దరి ఆలోచన, వ్యవహరించే తీరు మాత్రం ఒకటేనని స్పష్టంచేశాడు. 2008 అండర్–19 ప్రపంచకప్ నాటి నుంచి కోహ్లీ, విలియమ్సన్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఇప్పటికీ ఈ ఇద్దరు చాలా స్నేహపూరితంగా గడుపుతుంటారు.
- June 8, 2020
- Top News
- క్రీడలు
- KOHLI
- NEWZELAND
- TEAMINDIA
- అండర్–19 ప్రపంచకప్
- కేన్ విలియమ్సన్
- విరాట్ కోహ్లీ
- Comments Off on కోహ్లీని చిన్నప్పటి నుంచి చూస్తున్నా..