సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటన్ ను రిలీజ్ చేసింది. కొత్తగా 62 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రకటించింది. ఇలా రాష్ట్రంలో 955కు పాజిటివ్ కేసులు చేరాయి. కర్నూలు జిల్లాలో 27, గుంటూరు 11, అనంతపురం నాలుగు, తూర్పు గోదావరి ఆరు, కృష్ణా 14, ప్రకాశం మూడు, నెల్లూరు జిల్లాలో ఒకటి కేసు చొప్పున కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 261 కేసులు, గుంటూరు జిల్లాలో 206 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, కర్నూలు జిల్లాలో ఒక్కొక్కరు మృతిచెందారు.
ఇలా కరోనా పాజిటివ్ తో 29 మంది మృతి చెందారు. కరోనా పాజిటివ్ తో 145 మంది రోగులు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో 781 మంది చికిత్స పొందుతున్నారని ఏపీ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.