ఇండస్ట్రీలో హిట్ సినిమాల రీమేక్ ల ముచ్చట కొత్తేమీ కాదు. పొరుగు రాష్ట్రాల్లో విజయాన్ని సాధించిన సినిమాలను ఆయా భాషల వాళ్లు రీమేక్ చెయ్యడం ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయ్యింది కూడా. అందుకే ఏ సినిమా అయినా రిలీజై హిట్ అయితే మాత్రం వెంటనే ఆ సినిమా రైట్స్ ను దక్కించుకునే పనిలో పడుతున్నారు దర్శక నిర్మాతలు. ఈ కేటగిరీలోనే సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఇంతకు ‘ప్రేమమ్’ లాంటి మలయాళ చిత్రాన్ని రీమేక్ చేసింది. తెలుగులో ఆ సినిమా ఘన విజయాన్నే సాధించింది. తాజాగా మరో మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రం రానా, రవితేజలతో రీమేక్ అయ్యేందుకు సన్నాహాలు కూడా మొదలుపెట్టారు. ఈ లిస్ట్ ఇలా ఉండగానే మరో మలయాళ సినిమా రీమేక్ హక్కుల్ని సితార సంస్థ చేజిక్కించుకుందని తెలుస్తోంది. అన్నా బెన్ శ్రీనాథ్ భాసి రోషన్ మాథ్యూ నటించిన ‘కప్పేలా’ ఇటీవలే రిలీజై అక్కడ ఘన విజయాన్ని సాధించింది. యూత్ ఫుల్ లవ్ ఎమోషనల్ ఎంటర్ టెయినర్ గా సాగిన ఈ చిత్రం తెలుగులో కూడా వర్కవుతుందని సంస్థ భావిస్తోందట. అలాగే ఈ రీమేక్ బాధ్యతలు కూడా ఓ యువ దర్శకుడికే ఒప్పజెప్పనున్నట్లు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ – సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థలు ఇటీవల వరుస సక్సెస్ లతో స్పీడ్ పెంచింది కూడా. సితార ఎంటర్ టైన్ మెంట్స్ కంటెంట్ ఉన్న పరిమిత బడ్జెట్ చిత్రాల్ని నిర్మిస్తుంటే.. హారిక బ్యానర్ స్టార్ హీరోల తో చిత్రాల్ని నిర్మిస్తోంది.
- July 4, 2020
- Top News
- KAPPELA
- RANA
- అయ్యప్పనుమ్ కోషియం
- ప్రేమమ్
- Comments Off on కొనసాగుతున్న రీమేక్‌ల పరంపర