Breaking News

కొత్తగా ఆరుగురు.. ఇద్దరిపై వేటు

కొత్తగా ఆరుగురు.. ఇద్దరిపై వేటు

వార్షిక కాంట్రాక్ట్ లను ప్రకటించిన ఆస్ట్రేలియా

మెల్ బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) గురువారం వార్షిక కాంట్రాక్ట్ లను ప్రకటించింది. సీనియర్లు ఉస్మాన్ ఖవాజ, షాన్ మార్ష్ పై వేటు వేసి కొత్తగా ఆరుగురికి చోటు కల్పించింది. ఇందులో లబుషేన్, బర్న్స్, అగర్, మిచెల్ మార్ష్, కేన్ రిచర్డ్ సన్, వేడ్ ఉన్నారు. పురుషుల విభాగంలో 20 మందికి, మహిళల విభాగంలో 15 మందితో ఒప్పందం చేసుకుంది.

పురుషుల జాబితా: లబుషేన్, హెడ్, హాజిల్ వుడ్, ఫించ్, కమిన్స్, క్యారీ, బర్న్స్, అగర్, మిచెల్ మార్ష్, మ్యాక్స్ వెల్, పైన్, ప్యాటిన్ సన్, జై రిచర్డ్ సన్, కేన్ రిచర్డ్ సన్, స్మిత్, స్టార్క్, వేడ్, జంపా, వార్నర్.

మహిళల జాబితా: జార్జియా వారెహామ్, టైలా వ్లామినిక్, సదర్లాండ్, షుట్, ఎలీసా పెర్రీ, బెత్మూనీ, మోలినెక్స్, తాహ్లియా మెక్ గ్రాత్ మెగ్లానింగ్, కిమిన్స్, జొనాసెన్, హీలీ, హైన్స్, గాడ్ నెర్, నికోలా క్యారీ.