Breaking News

కొడుకు హీరో.. తండ్రి విలన్

కొడుకు హీరో.. తండ్రి విలన్

టాలీవుడ్​లో బ్లాక్ బస్టర్ ‘అర్జున్ రెడ్డి’ కోలీవుడ్ లో ‘ఆదిత్య వర్మ’ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఆదిత్య వర్మగా లీడ్ రోల్ చేసింది కోలీవుడ్ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్. సినిమా అంత సక్సెస్ సాధించకపోయినా నటుడికి ధృవ్​ కు మంచి పేరే వచ్చింది. మొదటి సినిమాతోనే తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం దక్కింది . ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్​ సుబ్బరాజ్ కాంబోలో విక్రమ్ 60వ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ మల్టీస్టారర్​గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో తండ్రీ కొడుకులిద్దరూ నటించనున్నారట. తండ్రితో కలిసి ధృవ్ ఈ సినిమా చెయ్యడం కోలీవుడ్​లో హాట్ టాపిక్ అయ్యింది. వినూత్నంగా తెరకెక్కే ఈ సినిమాలో విక్రమ్ ధృవ్ పాత్రలు పోటాపోటీగా ఉండనున్నాయట. అలాగే ధృవ్ పాజిటివ్ యాంగిల్ ఉండగా ఫాదర్ విక్రమ్ క్యారెక్టర్​కు నెగిటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నాడట. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది