సారథి న్యూస్, హుస్నాబాద్ : ‘ నా కుమారులు నన్ను పట్టించుకోవడం లేదని హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామానికి చెందిన తాడూరి దుర్గయ్య’ అనే వృద్ధుడు మంగళవారం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.. సందర్భంగా ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ కనిపెంచిన తల్లిదండ్రులను సంరక్షించాల్సిన బాధ్యతను పిల్లలు విస్మరించరాదని సూచించారు.
కన్నవారు వృద్ధాప్యంలో ఉంటే వారి బాగోగులు కుమారులే చూసుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఇబ్బందులకు గురి చేస్తే వారిచ్చే ఫిర్యాదు మేరకు కుమారులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృద్ధుడి కుమారులను పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. మానవతా దృష్టితో ప్రత్యేక చొరవ చూపించి సాయం చేసిన ఎస్సై సుధాకర్ ను పలువురు అభినందించారు.