రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
సారథి న్యూస్, గోదావరిఖని: గోదావరి దిశ మార్చి, తెలంగాణ దశ మార్చిన సీఎం కేసీఆర్ అపరభగీరథుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో రూ.70లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం కష్టాలను శాశ్వతంగా తొలగించాలనే సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో పథకాలను అమలుచేశారని కొనియాడారు. తెలంగాణ ప్రాంత రైతులు మరింత ఆర్థిక అభివృద్ధి సాధించే విధంగా ప్రభుత్వం నూతన సాగువిధానం అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో అంతర్గాం జడ్పీటీసీ ఆముల నారాయణ, ఎంపీపీ దుర్గం విజయ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ, సర్పంచ్ ధరణి రాజేష్, బండారి ప్రవీణ్, తహసీల్దార్ బండి ప్రకాష్, ఎంపీడీవో యాదగిరి పాల్గొన్నారు.