సారథి న్యూస్, గోదావరిఖని: లాక్ డౌన్ నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా చౌరస్తాలో ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమాన్ని సీపీ సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు.
పేదలకు ఇబ్బందులు పడకూడదనే భోజనాలు పెట్టిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, పట్టణ సీఐ మూర్తిలింగయ్య, మంచిర్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్, మంచిర్యాల పట్టణ ఎస్సైలు ప్రవీణ్ కుమార్ మారుతి, మార్వాడి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.